చర్చలు సఫలం.. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె విరమణ

కలం, నిర్మల్ : నేషనల్ హెల్త్ మిషన్ (NHM Strike) ఉద్యోగులు గత 33 రోజులుగా చేపట్టిన సమ్మెను శనివారం విరమించారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఆరోగ్యశాఖ కార్యదర్శితో ప్రభుత్వం జరిపిన చర్చల్లో స్పష్టమైన హామీ లభించడంతో సమ్మెను ముగిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్‌కు సమ్మె విరమణ పత్రాన్ని అందజేసి సన్మానించారు. సోమవారం నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి విధుల్లో చేరనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం జరిగినా, హామీలను నెరవేర్చకపోయినా తిరిగి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. సమ్మెకు సహకరించిన ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల నాయకులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>