Mobile Popup Ad
Mobile Popup Ad

రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి మేం వ్యతిరేకం: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: మూసీ సుందరీకరణ పేరు మీద లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీకి తాము తీవ్రంగా వ్యతిరేకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. అందుకే ఈరోజు సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వద్ద మూసీ డీపీఆర్ (DPR) ఏది అంటే సమాధానం లేదని మండిపడ్డారు. ఎన్ని ఇళ్లు కూలగొడుతున్నారు అనేది కూడా సమాధానం చెప్పడం లేదన్నారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ డీపీఆర్ లేదని అంటున్నాడని ఆగ్రహించారు. ప్రభుత్వం ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రజెంటేషన్ వద్దని, బాధితులతోనే ప్రజలతోనే పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. అందుకే ప్రభుత్వ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు మేము హాజరు కాలేదని చెప్పారు.

మూసీని మురికికూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉంటే వెంటనే సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ నగర్‌లో నోటీసులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. కేవలం 1,450 ఇళ్లు కూల్చివేస్తామని చెప్పి 10,000 ఇళ్లకు పైగా సంబంధించి నోటీసులు ఇచ్చారని ఆగ్రహించారు. ఖమ్మం జిల్లాలో ఇళ్లు కూలగొడితే ఉప ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేదన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>