కలం, ములుగు: ములుగు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీతక్కకు తనకు రక్త సంబంధం లేకపోయినా సోదరి కంటే ఎక్కువ చూస్తుంటానని.. కానీ, ఆస్తి ఎక్కడ ఇవ్వాల్సి వస్తోందనని సొంత సోదరిని ఒకరు ఇంటి నుంచి వెళ్లగొట్టారని కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. కుమారుడికి మంచి చెప్పాల్సిన తండ్రి ఫాం హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.
తండ్రి కుమారులను మించి మేనల్లుడు అఘోరా రావు తెలంగాణలో కరువు రావాలని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి అఘోర, క్షుద్ర పూజలు, చేత బడులు చేస్తున్నారని హరీశ్ రావును (Harish Rao) ఉద్దేశించి సీఎం రేవంత్ ఆరోపించారు. అధికారం కోల్పోతే ఎవరైనా చావు కోరుకుంటారా.. వీరు ఆడబిడ్డలకు న్యాయం చేస్తారా.. ప్రశ్నించారు. ఎవరెన్ని చేసినా దేవుడు తమ వైపే ఉన్నాడని.. మంచి పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ములుగు కలెక్టరేట్ ప్రారంభం..
అంతకుముందు ములుగు జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన జిల్లా కలెక్టరేట్ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ములుగు నుంచి సీఎం రేవంత్ రెడ్డి పరకాలకు వెళ్లారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
Also Read : స్మార్డ్ రేషన్ కార్డుపై మోదీ ఫోటో పెట్టాల్సిందే: బోయినపల్లి ప్రవీణ్
Follow Us On: X(Twitter)

