కలం, నిజామాబాద్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. జుక్కల్ (Jukkal) నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం కంధర్‌పల్లి గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు (MLA LaxmiKantha Rao) కుమార్తె జొనిట-దాస్ వివాహ విందు జరిగింది. సీఎం రేవంత్ ఈ విందుకు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు కుటుంబ సమేతంగా ఘన స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న సీఎం వధూవరులు జొనిట, దాస్ లను ఆశీర్వదించారు.
సుమారు 20 నిమిషాల పాటు వేడుకలో పాల్గొని అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొన్నారు.
Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!
Follow Us On: Instagram

