Mobile Popup Ad
Mobile Popup Ad

పునరుద్ధరించిన శాస‌న మండ‌లిని ప్రారంభించిన సీఎం రేవంత్‌

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత నిజాం కాలం నాటి చారిత్రక పురాత‌న‌ అసెంబ్లీ భవనం కౌన్సిల్‌ (TG Council Building) కార్యకలాపాలకు వేదిక కానుంది. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో 18 నెలల పాటు శ్రమించి ఆధునీకరించిన ఈ వారసత్వ కట్టడాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు ప్రారంభించారు. మండ‌లి స‌మావేశాల‌ను నిర్వహించేందుకు అనుకూలంగా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి, రిబ్బన్ కట్ చేసి భవనంలోకి ప్రవేశించారు. అనంతరం పునరుద్ధరించిన సభా ప్రాంగణాన్ని, సీఎం ఛాంబర్‌ను, మండలి చైర్మన్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన కాసేపు మాట్లాడారు. రానున్న బ‌డ్జెట్ స‌మావేశాలు నూత‌న భ‌వ‌నంలోనే జ‌రుగ‌నున్నాయి.

Read Also: కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట: బండి సంజయ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>