Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట: బండి సంజయ్

కలం, మెదక్ బ్యూరో: రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ (Bandi Sanjay) అన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రధాని మోడీ లక్షా 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. ఆదివారం బండి సంజ‌య్ మెద‌క్ జిల్లాలో ప‌ర్య‌టించారు. కౌడిపల్లి మండ‌లం తునిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, రైతుల వసతి గృహాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం తయారు కావాలంటే సేంద్రీయ వ్యవసాయాన్ని కొనసాగించాలని సూచించారు. సేంద్రీయ వ్యవసాయంతోనే ఆరోగ్యవంత‌మైన‌ దేశం అవతరిస్తుందన్నారు. రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని చెప్పారు. కేంద్రం అందిస్తున్న స‌బ్సిడీలు, స‌దుపాయాలు వినియోగించుకోవాల‌ని రైతుల‌కు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>