కలం, వెబ్ డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)కు ఉన్న క్రేజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదని మరోసారి రుజువైంది. నేడు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవం కోసం బెంగళూరు (Bengaluru)కు వెళ్లిన ఎన్టీఆర్‌ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. తారక్ వస్తున్నాడన్న సమాచారంతో ఆసుపత్రి పరిసర ప్రాంతాలతో పాటు ఎయిర్ పోర్ట్ నుంచి దారిపొడవునా వేల సంఖ్యలో అభిమానులు బారులు తీరారు. ఎన్టీఆర్ కారు కనిపించగానే ఫ్యాన్స్ ఉత్సాహంతో కేకలు వేశారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ను (NTR) చూడగానే అభిమానులు “సీఎం.. సీఎం..” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగు హీరోకు పక్క స్టేట్‌లో ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉండటం.. అందులోనూ సీఎం నినాదాలు చేయడం కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: మహిళా దినోత్సవం.. సమంత మూవీ నుంచి స్పెషల్ వీడియో!
Follow Us On : WhatsApp

