పార్లమెంటులో సీఎం రేవంత్‌ను పలకరించిన రోజా..!

కలం, తెలంగాణ బ్యూరో: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) పార్లమెంటులో పలువురు కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు రాహుల్‌గాంధీని, ప్రియాంకాంగాధీని కలిశారు. తెలంగాణ నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి సైతం రాహుల్‌, ప్రియాంకాలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ఆవరణలో వైసీపీ నేత రోజా (Roja)ను సైతం సీఎం రేవంత్‌రెడ్డి పలకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటుకు రావడంపై సహజంగానే సీఎం ఆమెను ప్రశ్నించారు. చిన్న పని మీద వచ్చానంటూ ఆమె బదులిచ్చారు. ఏపీ, తెలంగాణ రాజకీయాల గురించి వీరిద్దరి మధ్య చర్చ జరుగుతుందని పాత్రికేయులు సహా పలువురు భావించినా సెకన్ల వ్యవధిలోనే వారివారి పనుల మీద వెళ్లిపోయారు. ఎలా ఉన్నారంటూ మొదలైన వారిద్దరి సంభాషణ కొద్దిసేపే అయినా ఆసక్తికరంగా సాగింది. ఊహించని తీరులో ఎదురెదురు పడడంతో మాట్లాడుకోవాల్సి వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>