కలం, వెబ్ డెస్క్: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు (Farmhouse Drugs Case) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టాపిక్‌గా మారింది. తన ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ ఈగల్ టీమ్‌కు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు మరికొందరు దొరికిపోయారు. దీంతో ఈ ఘటన జాతీయ మీడియాలోనూ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే మొయినాబాద్ ఫాంహౌస్ కేసుపై సిట్ విచారణకు ఆదేశించారు.
9 మందితో సిట్
మొత్తం 9 మంది పోలీసు అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు (Farmhouse Drugs) Case) తేనె తుట్టేను కదిపేందుకు సిట్ దర్యాప్తు షురూ చేసింది. ఈ ఫాంహౌస్‌కు డ్రగ్స్ ఎలా సప్లై అయ్యింది? దీని వెనుక పాత్ర దారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? ఇలా ప్రతి అంశాన్ని నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమైంది.
ఫామ్‌హౌస్ డ్రగ్ సరఫరా ఇలా..
మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో పోలీసులు పలు వివరాలు సేకరించారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి అనే వ్యక్తి సిమ్లా నుండి మొయినాబాద్ ఫామ్‌హౌస్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు సిమ్లా ట్రిప్‌లో గుర్తుతెలియని వ్యక్తి నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రోహిత్ రెడ్డి పీఏ కౌశిక్ రవి ఓ స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఈ ఫామ్‌హౌస్‌పై తహసిల్దార్ చర్యలేవి అని సిట్ ప్రశ్నిస్తుంది. వెంటనే ఫామ్‌హౌస్‌ను సీజ్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
కాల్పులుపై ఆరా..
ఫామ్‌హౌస్‌లో సోదాలకు ఈగల్ పోలీసులు మళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరపడం పెను సంచలనంగా మారింది. పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆత్మరక్షణకు వాడాల్సిన గన్‌ను ఇలా అసాంఘిక చర్యలకు వాడటమేంటని.. ఇలాంటి వారికి లైసెన్స్‌లు ఎలా ఇస్తారని ? పోలీసుల తీరుపై సిట్ ఫైర్ అయింది. పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి తుపాకీ లైసెన్స్‌ను రద్దు చేయాలని సిట్ అధికారులు సీపీకి లేఖ రాశారు.
బీఆర్‌ఎస్ లీడర్లలో గుబులు..
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ పెద్ద తలకాయల హస్తం కూడా ఉందా? అనే కోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. బీఆర్‌ఎస్ బడా లీడర్ కూడా ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకున్నా ఉదంతలు ఉన్నాయని సిట్ అనుమానిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో 3 నెలల్లో ఫాంహౌస్ బండారం బయటపెట్టేందుకు సిట్ దూకుడుపెంచింది. ఈ వ్యవహారంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో భయం మొదలైందని సమాచారం. రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

