కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎల్నినో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వరంలో కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ తరుణంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రులను సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని కరువు పరిస్థితులను వివరించాలని సూచించారు.
Also Read : వ్యక్తిగత విమర్శలు చేస్తే.. ఇదే ఆసుపత్రిలో చికిత్స ఇప్పిస్తాం: బీజేపీ నేతలు
Follow Us On: Youtube

