Mobile Popup Ad
Mobile Popup Ad

ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

కలం, నల్లగొండ బ్యూరో: నల్గొండ (Nalgonda) పట్టణంలోని పానగల్ ఫ్లైఓవర్‌పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్నాడు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (Software Engineer) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాయి సందీప్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తన స్వగ్రామం నుంచి కారులో హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున పానగల్ ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం సంభవించింది. వంతెనపై ఆగి ఉన్న లారీని సాయి సందీప్ ప్రయాణిస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.

సాయి సందీప్ మృతదేహం కారులోనే ఇరుక్కుపోయి, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న నల్గొండ టూ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ రాఘవులు, ఎస్ఐ సైదులు స్వయంగా పర్యవేక్షించి, కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని గ్యాస్ కట్టర్ల సాయంతో అతి కష్టం మీద బయటకు తీశారు. ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సాయంతో వాహనాలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడు సాయి సందీప్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>