కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth) ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా పార్లమెంటు నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరిన సీఎం.. శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులతో సీఎం రేవంత్, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి కూడా సీఎం వెంట ఉన్నారు. పలు అంశాలపై పార్టీ సీనియర్ నేతలకో సీఎం చర్చించారు.
బిజీ షెడ్యూలు కారణంగా నేరుగా పార్లమెంటు నుంచి అసెంబ్లీకి రేవంత్ (Revanth) చేరుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున తొలి రోజున గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వివిధ పార్టీల నేతలంతా అభిప్రాయాలను వెల్లడించారు. వాటికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి సమాధానం ఇచ్చి ముగించాల్సి ఉన్నందున బిజీ షెడ్యూలుతో విమానాశ్రయం నుంచి డైరెక్టుగా అసెంబ్లీకే చేరుకున్నారు.

