కలం, వెబ్‌డెస్క్: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) కుమార్తె అంజిలి ఎంగేజ్మెంట్ డాక్టర్ రఘుతో రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్‌గూడలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు, షర్మిల దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం దంపతులతో పాటు ఈ వేడుకకు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఏపీ కాంగ్రెస్ మాజీ లీడర్ రఘువీరా రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

