కలం, నిర్మల్: విద్యార్థులు, యువ ఓటర్లలో ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో.. 009 నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్మల్ ఆర్డీవో(Nirmal RDO), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దేవిదాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీల్లో మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు పాల్గొనాలని పేర్కొన్నారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 13న ఉదయం 11 గంటలకు నిర్మల్లోని భాగ్యనగర్ నారాయణ హైస్కూల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సంబంధిత అధికారులు, పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎంపికైన విద్యార్థులను సకాలంలో పంపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

