తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం రేవంత్, కేసీఆర్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆటపాటలతో వైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రకృతిని ఆరాధించడం తెలంగాణ ప్రత్యేకత అని ఈ సందర్భంగా చెప్పారు. సామూహిక జీవన విధానం, ఐక్యతకు బతుకమ్మ నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.

ఆడబిడ్డల సంక్షేమానికి కృషిచేశాం..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సైతం రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పువ్వులనే దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ, దేశంలోని అన్నిసాంప్రదాయ పండుగల్లో ప్రత్యేకమైనదని కొనియాడారు. తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సామాజిక సంస్కృతికి దర్పణంగా నిలిచే బతుకమ్మపండుగ, తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైందని తెలిపారు.

ఎంగిలిపూల బతుమ్మగా ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంటుందని తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్నికాపాడుతూ వారి సంక్షేమానికి పలు రకాల పటిష్ట కార్యక్రమాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తుచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>