కలం, స్పోర్ట్స్: భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ (West Indies ) ఘన విజయం సాధించింది. వరుస వికెట్లు పడుతున్న కరేబియన్స్ బ్యాటర్ షై హోప్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. వన్డేల్లో చివరి మ్యాచ్ తరహాలోనే ఈ రెండో టీ20లో కూడా హోప్ సెంచరీతో మెరిశాడు. హోప్‌కు రూథర్‌ఫోర్డ్ అద్భుతమైన మద్దతు ఇచ్చాడు. స్టార్టింగ్‌లో భారత బౌలర్లు అదరగొట్టినా.. ఆ తర్వాత భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో భారత్‌పై వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అంచనాలను అందుకుంటూ అదరగొట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కలిసి అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అభిషేక్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి చేజ్ బౌలింగ్‌లో మోటీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయినా వన్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ మంచి పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. కాగా 139 పరుగుల దగ్గర కిషన్(22 బంతుల్లో 43 పరుగులు) వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత శివమ్ దూబే కూడా అలా వచ్చి 7 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అప్పుడు బరిలోకి దిగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ మ్యాచ్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ కీలక సమయంలో సంజూ శాంసన్ 41 బంతుల్లో 9ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్‌కు ముగింపు వచ్చింది. స్రింగర్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్ ఇచ్చి సంజూ పెవిలియన్ చేరాడు. కాగా తిలక్ వర్మతో కలిసి అయ్యర్ మ్యాచ్‌ను ముందు సాగించాడు. వీరిద్దరూ కూడా నువ్వా నేనా అన్న స్థాయిలో బౌండ్రీలు బాదారు. కానీ చివరి నిమిషయంలో శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 40 పరుగులు చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. తిలక్ వర్మ కూడా 18 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. చివర్లో క్రీజ్‌లోకి వచ్చిన నమన్ ధీర్ 1 బంతికి 4 పరుగులు చేశాడు. వీటికి తోడు విండీస్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో 8 పరుగులు ఇచ్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
వెస్టిండీస్ బౌలర్లలో రోస్టర్ చేజ్ అదరగొట్టాడు. 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టి టీమిండియాకు కొంచెం తలనొప్పి తెచ్చాడు. ఆ తర్వాత హమర్ స్ప్రింగర్ 4 ఓవర్లలో 64 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు స్టార్టింగ్‌లోనే భారీ షాక్ తగిలింది. భారత బౌలర్ మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఓపెనర్ కమిల్ పూరన్ 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన హెట్‌మేయర్‌ను డకౌట్ చేసి పెవిలియన్ పంపాడు మయాంక్. దీంతో 5 పరుగులకే వెస్టిండీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత రోవ్‌మన్ పోవెల్ కాస్తంత నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా మయాంగ్ ఆ అవకాశం ఇవ్వలేదు. 24 పరుగుల దగ్గర పోవెల్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో విండీస్ కెప్టెన్, ఓపెనర్ షై హోప్‌పై మరోసారి తీవ్ర ఒత్తిడి పడింది. అయితే రూథర్‌ఫోర్డ్ నిలదొక్కుకున్నాడు. వీరిద్దరూ కలిసి విండీస్ స్కోర్‌ను ముందుకు నడిపించారు. కానీ 178 పరుగుల దగ్గర రూథర్‌ఫోర్డ్ కుల్దీప్ బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. 37 బంతుల్లో 7ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన షెపర్డ్.. ఓపెనర్, కెప్టెన్ హోప్‌కు మద్దతుగా నిలిచాడు. 13 బంతులలో 34 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఓపెనర్‌గా వచ్చిన హోప్ సెంచరీతో అదరగొట్టాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 102 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు తీయగా కుల్దీప్ ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నాడు. అక్సర్ పటే మాత్రం 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 63 పరుగులు ఇచ్చాడు. మిగిలిన బౌలర్లు కూడా అదే విధంగా పరుగులు ఇచ్చారు. విండీస్ బ్యార్లు హోప్, రూథర్‌ఫోర్డ్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.

