కలం, వెబ్‌డెస్క్: తెలంగాణలో జరిగిన సర్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన మైనారిటీల ఎక్సెలెన్స్ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో 70 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయని సీఎం అన్నారు.
చిన్ని చిన్న పొరపాట్లతో ప్రజల ఓట్లు పోకూడదని సీఎం సూచించారు. కొందరు నాయకులు బెంగాల్ తర్వాత తెలంగాణే తమ టార్గెట్ అంటూ ప్రకటనలు చేస్తున్నారని, ఓట్లు తొలగించినా వారి కుట్రలు ఫలించకూడదని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

