రూ.1,511 కోట్ల పనులను ప్రారంభించిన సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) శంకుస్థాపనలు చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లే అవుట్ కు చేరుకున్న సీఎం.. రూ.1,511 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో రూ.98 కోట్లతో నిర్మించే మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. రూ.960 కోట్ల రూపాయలతో ఏఓసి సెంటర్ లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఎల్‌బీనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు టీకేఆర్ కాలేజ్ జంక్షన్ వద్ద రూ.416 కోట్లతో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు రూ.37.50 కోట్లతో 100 పడకల సామర్థ్యంతో నిర్మించనున్న మల్కాజ్‌గిరి జిల్లా ఆస్పత్రి భవనానికి సీఎం (CM Revanth) శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా CURE 1– Initiative (Common Unified Billing and Collection System) క్యూర్-1 యాప్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. సభలో మూసీ ప్రక్షాళన ఆవశ్యకత, మెట్రో విస్తరణ, పరిపాలనా సౌలభ్యం కోసం కోర్ ప్రాంతాన్ని 3గా వికేంద్రీకరించడాన్ని వివరించారు.

Read Also: ల‌డ‌ఖ్‌లో హైద‌రాబాద్ యువ‌కుడి ప‌ర్వ‌తారోహ‌ణ‌.. డీజీపీ ఫోటోతో ఎమోష‌న‌ల్ పోస్ట్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>