Mobile Popup Ad
Mobile Popup Ad

కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి సహకారం: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధులు విడుదల జరుగకుండా కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ (KTR) ఉన్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డికి అంత తెలివి లేదని.. కేటీఆర్ చెప్పిందే ఆయన చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కుట్రలు చేస్తుంటే కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు లొంగిపోయి కిషన్ రెడ్డి తమకు అడ్డుపడుతున్నాడని విమర్శించారు. కిషన్ రెడ్డి (Kishan Reddy) నిధులు ఇప్పించి ఎన్ఓసీ ఇప్పిస్తే శాలువా కప్పి సన్మానం చేస్తామని చెప్పారు. అహ్మదాబాద్, ఉత్తర ప్రదేశ్, వైజాగ్ కు కూడా మెట్రోను మంజూరు చేశారు.. కానీ తెలంగాణకు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివక్ష ఏ స్థాయిలో ఉందో మీరే అర్థం చేసుకోవాలని అన్నారు. రాజకీయాల కోసం నేను మాట్లాడటం లేదని.. మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకొని, మెట్రో ఫేజ్ 2ను పూర్తి చేసుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్య,మని చెప్పారు.

లోన్ వచ్చిందనుకుంటే కిషన్ రెడ్డి అడ్డుకున్నారు..

హైదరాబాద్ మెట్రోపై ఎల్ అండ్ టీ సంస్థ రూ.13,600 కోట్లు 8.25 శాతం వడ్డీకి బ్యాంకుల్లో రుణం తెచ్చుకుందని సీఎం అన్నారు. ఆ లోన్ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. IRFC ద్వారా తక్కువ వడ్డీకి రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడానికి అప్పటి సీఎం కేసీఆర్ కు పీఎఫ్సీ, ఆర్ఈసీ ద్వారా పదేళ్లలోరూ. 3 లక్షల 15 వేల కోట్లు ఎలాంటి గ్యారెంటీ లేకుండా, మూడో కంటికి తెలియకుండా కేంద్రం అప్పు ఇచ్చిందని ఆరోపించారు. 9 నుంచి 11.5 శాతం వడ్డీతో అప్పులు ఇచ్చారని అన్నారు. తాము ఐఆర్ఎఫ్సీ (IRFC)ని లోన్ కు ఒప్పించామని.. రూ.13,600 కోట్లు 4 శాతం వడ్డీకి 20 ఏళ్లకు జపాన్ సంస్థతో అప్పు తీసుకొచ్చేందుకు ఒప్పించామన్నారు. ఇది ఐఆర్ఎఫ్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉందని అన్నారు. రూ.1,400 కోట్లు తమ ప్రభుత్వం కట్టాల్సింది కట్టామని.. లోన్ వచ్చినట్లే అని అనుకుంటే కిషన్ రెడ్డి అడ్డుకున్నారని మండిపడ్డారు.

ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోరు?

మే నెల 20వ తారీఖున కేంద్ర మంత్రి మోహన్ లాల్ ఖట్టర్ ను, 21న మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కిషన్ రెడ్డి కలిసి ఇవ్వొద్దని చెప్పారని ఆరోపించారు. తాము అందుకే కిషన్ రెడ్డి వెనక పడుతున్నామని ఫైర్ అయ్యారు. ఇవాళ నిధులు విడుదల కావాల్సి ఉందని.. ఆ బాధ్యత కిషన్ రెడ్డిదేనన్నారు. కిషన్ రెడ్డి కష్టమనుకుంటే తమ 50 శాతం భాగస్వామ్యం అవసరం లేదని స్పష్టం చేశారు. తమరు NOC ఇవ్వండి.. తామే పూర్తిగా భరించి మెట్రో విస్తరణ చేసుకుంటామని చెప్పారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారని.. నలుగురు తమ ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే మెట్రో విస్తరణ జరగాల్సి ఉందని చెప్పారు. ఎందుకు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోరు? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డిపై తమకు గౌరవం ఉందని… అలాగే ఆయనపై అసహనం ఉందని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>