కలం, వెబ్‌డెస్క్ : విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) లో ఈనెల 27న శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకుని ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం వీరిద్దరూ కలిసి ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఉత్సవాల అనంతరం సోమవారం రాత్రి విశాఖలో బస చేయనున్నారు. అనంతరం 28న ఉదయం విశాఖపట్నం నుంచి బయలుదేరి 9 గంటలకు ఆనందపురం మండలం, తర్లువాడ చేరుకోని గూగుల్ డేటా సెంటర్‌కు భూమి పూజ నిర్వహించనున్నారు.

