ఢిల్లీలో చంద్రబాబు ..జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ

కలం, వెబ్ డెస్క్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతితో పాటు ఇటీవల రూ.30 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కార్యక్రమం వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు వివరించారు. రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే లక్ష్యంతో పనులను వేగవంతం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న పలు అంశాలను త్వరగా పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరారు.

ప్రొటెక్టివ్ ఎంబాంక్‌మెంట్ల నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తికాకపోవడంతో అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన స్టాప్‌ వర్క్‌ ఆర్డర్ ప్రస్తుతం అమలులో లేకపోయినా, దాన్ని శాశ్వతంగా ఉపసంహరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలతో చర్చించి ప్రజాభిప్రాయ సేకరణను త్వరగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.

పోలవరం వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పునరావాస, పునరావాస ప్యాకేజీ పనులను వేగంగా చేపడుతున్నామని చంద్రబాబు వివరించారు. గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసేందుకు పట్టిసీమ ద్వారా నీటిని తరలిస్తున్న విధానాన్ని, నదుల అనుసంధానం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా కేంద్ర మంత్రికి వివరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>