కలం, వెబ్ డెస్క్: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి నుంచి సీఎం చంద్రబాబు (CM Chandrababu) సింగపూర్ కు బయల్దేరారు. బెంగుళూరు నుంచి బయల్దేరి నేటి సాయంత్రానికి సింగపూర్ చేరుకోనున్నారు. రేపు, ఎల్లుండి అక్కడ జరిగే వివిధ సమావేశాలకు సీఎం హాజరుకానున్నారు. సోమవారం సింగపూర్ ప్రధాన మంత్రి సహా పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. మంగళవారం వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించనున్నారు. 16వ తేదీ సాయంత్రం సీఐఐ నిర్వహించే రోడ్ షోకు హాజరై పారిశ్రామిక వేత్తలతో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఆరోజు రాత్రికి స్వదేశానికి సీఎం తిరిగిరానున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు సహా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం బృందం సింగపూర్ లో పర్యటించనుంది.

