Mobile Popup Ad
Mobile Popup Ad

వామ్మో.. 3వేల కిలోల కల్తీ పనీర్ పట్టివేత

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాలు నిలువునా వణికిస్తున్నాయి. అసలు జనాలు తింటుంది నిజమైందో కాదో కూడా తెలియనంత రేంజ్ లో కల్తీ ఫుడ్ వ్యాపారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా 3వేల కిలోల కల్తీ పనీర్ ను (Fake Paneer) పట్టుకున్నారు. ఇది భాగ్యనగరం వాసులను ఒకింత షాక్ కు గురి చేసింది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరు షాపుల మీద దాడులు నిర్వహించగా.. ఈ కల్తీ గుట్టు బయటపడింది. శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్ లో 1600 కిలోలు, విజయ్ మిల్క్-కర్డ్ షాప్ లో 1000 కిలోల కల్తీ పనీర్ దొరికింది.

ఈ షాపుల నుంచి కల్తీ పనీర్ (Fake Paneer) హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారులు అధికారులు గుర్తించారు. ఈ షాపుల నిర్వాహకులు పనీర్ కోసం పాలు వాడకుండా.. కేవలం పిండి, కొన్ని రకాల కెమికల్స్ ను వాడి పనీర్ ను తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. షాపుల నిర్వాహకులను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ మధ్య వరుసగా కల్తీ ఆహారా పదార్థాలు బయటపడుతున్నాయి. పెద్ద ఎత్తున కుళ్లిపోయిన మాంసం, కల్తీ ఫుడ్స్ రెస్టారెంట్లు, హోటళ్లలో బయటపడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>