గంగాధర పీఎస్‌ను వార్షిక తనిఖీ చేసిన సీపీ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని గంగాధర పోలీసు స్టేషన్ (Gangadhara PS)ను గురువారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ (Karimnagar CP Ghaus Alam) వార్షిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు విచ్చేసిన కమీషనర్ కు స్టేషన్ ఎస్సై వంశీకృష్ణ పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గార్డ్ అందించిన గౌరవ వందనం స్వీకరించారు.

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు. పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి, వారికి కేటాయించబడిన విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్ఎస్ (CCTNS) లో పొందుపరచాలని సూచించారు.

సీపీ పరిశీలన..

తెలంగాణ పోలీసులు టెక్నాలజీ వినియోగంలో భాగంగా ఉపయోగించే సీసీటీఎన్ఎస్ – 2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో ఈ-సమన్ల జారీ, అమలు, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్, దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్‌లో ఆర్థిక, ఆర్థికేతర నేరాల సమాచారం, సీడీఆర్ వంటి అన్ని రకాల సాఫ్ట్‌వేర్/అప్లికేషన్‌లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, వాటిని రోజువారీ విధుల్లో విరివిగా వినియోగించాలన్నారు. పోలీస్ స్టేషన్ కి కేటాయించబడిన పరికరాలను, అలాగే పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ను బ్లూ కోల్ట్స్ సిబ్బంది వినియోగించే తీరును పరిశీలించారు.

సీపీ ఆదేశాలు..

అలాగే ఎఫ్ఐఆర్ (FIR) ఇండెక్స్ ని పరిశీలించి, పెండింగ్ కేసులపై సీపీ సమీక్ష జరిపారు. కేసుల ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని, త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదైన సైబర్ నేరాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గంగాధర పోలీసు స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లుగా, సబ్ సెక్టార్లుగా విభజించి వాటికి గ్రామ పోలీసు అధికారులను (GPO) కేటాయించాలని స్పష్టం చేశారు.

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబంధించిన నూతన సమాచారాన్ని సేకరించి రికార్డుల్లో నమోదు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణలతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>