ముంబ‌యిలో సీజేపీ నిర‌స‌న‌లు షురూ..!

క‌లం, వెబ్‌డెస్క్‌: స‌ర్ ప్ర‌క్రియ‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ముంబ‌యిలో నిర‌స‌న‌లు ఊపందుకున్నాయి. ముంబ‌యిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మైదానంలో సీజేపీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న (CJP Protest)కొన‌సాగుతోంది. స‌ర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయ‌ని, పౌరుల ఓటు హక్కుపై తీవ్ర‌ ప్రభావం చూపుతున్నారనే ఆరోపణలతో ఈ ఆందోళనలు చేపట్టారు. కాగా, సీజేపీ చేప‌డుతున్న ఈ నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.

మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఆప్ నేతలు, పలు సంఘాల‌ ప్రతినిధులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించడంతో పాటు భారీగా మోహరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఆందోళనకు దిగిన ఆప్ నేతలు, వివిధ విద్యార్థి సంఘాల కార్యకర్తలు సహా సుమారు 700 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read : కష్టకాలంలో హనుమాన్ చాలీసా చదివా: ప్రధాని మోదీతో కెప్టెన్ స్మిత్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>