కలం, వెబ్ డెస్క్: సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఓట్లను దొంగలించి ప్రధానమంత్రి అయ్యారని, బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపించి ఓట్లను తొలగించారని ఆరోపించారు. చనిపోయింది ఓటర్లు కాదని, దేశ ప్రజాస్వామ్యమేనని విమర్శించారు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలతోనే ఎన్నికల కమిషన్ అధికారి జ్ఞానేశ్ కుమార్ ఓట్లను తొలగించారని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ చర్యల ద్వారా దేశ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని అభిజీత్ దీప్కే విమర్శించారు.

