కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ సిఐడి విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్ ఇద్దరు యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు (CID Constable Arrest). తన పదవ తరగతి క్లాస్‌మేట్‌తో గత 11 ఏళ్లుగా ప్రేమాయణం నడిపిన అరుణ్, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత సదరు యువతికి అబార్షన్ చేయించడమే కాకుండా, ఆమెకు తెలియకుండా గత జూలైలో మరో యువతిని రహస్యంగా వివాహం చేసుకున్నాడు.
పెళ్లి అనంతరం ప్రియురాలిని పూర్తిగా దూరం పెట్టడంతో అనుమానం వచ్చిన బాధితురాలు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు అరుణ్‌కుమార్ ప్రవర్తనపై అతడి భార్య కూడా ఖమ్మంలో కేసు నమోదు చేసింది. భార్య, ప్రియురాలి ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి అరుణ్‌కుమార్‌ను అరెస్ట్ (CID Constable Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read : నాలుగేళ్ల చిన్నారిపై కరెస్పాండెంట్ అఘాయిత్యం
Follow Us On : WhatsApp

