హైవేనే రన్‌వేగా.. ఆర్మీ విమానాల చారిత్రక ల్యాండింగ్!

కలం, వెబ్ డెస్క్ : గుజరాత్‌లోని అమృత్‌సర్-జామ్‌నగర్ ఎకనామిక్ కారిడార్‌పై భారత సైన్యం (Indian Army) అరుదైన ఘనతను సాధించింది. సైన్యానికి చెందిన నాలుగు మైక్రోలైట్ విమానాలు ఈ జాతీయ రహదారిపై విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ నిర్వహించి చరిత్ర సృష్టించాయి. యుద్ధ సమయాల్లో, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రధాన విమానాశ్రయాలు అందుబాటులో లేకపోతే, జాతీయ రహదారులను అత్యవసర రన్‌వేలుగా వినియోగించుకునే వ్యూహాత్మక సామర్థ్యాన్ని ఈ కసరత్తు ద్వారా విజయవంతంగా పరీక్షించారు.

భారత సైన్యం మరియు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయానికి ఈ కసరత్తు నిదర్శనంగా నిలిచింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు, రక్షణ దళాలు కలిసి పనిచేయడం ద్వారా దేశ భద్రతా సన్నద్ధత మరింత బలోపేతమవుతుందని ఈ విన్యాసం చాటిచెప్పింది.

Also Read : ఎల్ నినో ఎఫెక్ట్.. నాలుగు నెలల ముందే బయటపడిన ఆలయ శిఖరం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>