చింతలపేట స‌ర్కారు బ‌డిపై అంతులేని నిర్ల‌క్ష్యం

​కలం, జోగులాంబ‌ గద్వాల: గద్వాల పట్టణంలోని చింతలపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Chinthalpet School) భవనం శిథిలావస్థకు చేరి విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది. పాఠశాల తరగతి గదుల స్లాబ్ ఒరిగిపోయి, పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. పాఠశాలలో మొత్తం నాలుగు తరగతి గదులు ఉండగా, అందులో ఒక గది సీలింగ్ పెచ్చులు ఊడి ప్రమాదకరంగా మారడంతో దానికి తాళం వేసి ఉంచారు. ప్రస్తుతం 80 నుంచి 90 మంది విద్యార్థులు అభ్యసిస్తున్న ఈ పాఠశాలలో మిగిలిన గదులు కూడా సరిగ్గా లేకపోవడంతో అరకొర వసతుల మధ్యే పాఠాలు వినాల్సి వస్తోంది.

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. బయటి డ్రైనేజీ నీరు పాఠశాల ప్రాంగణంలోకి చేరి దుర్గంధం వెదజల్లుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవన పరిస్థితిపై అధికారులకు పలుమార్లు విన్నవించినా, జిల్లా స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో స్వయంగా ఫిర్యాదు చేసినా ఏ ఒక్క అధికారి స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన తరగతి గదిలో పెచ్చులూడుతాయోన‌ని భయం భయంగా పిల్లలను బడికి పంపుతున్నామని వారు తెలిపారు. ​రోజూ ప్రమాదపు అంచుల మీద త‌ర‌గ‌తులు సాగిస్తున్న‌ ఈ బడికి తక్షణమే మరమ్మతులు చేపట్టి, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణంలో విద్యనందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>