కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరిలోని బాలాజీ దేవాలయం (Chilkur Balaji Temple) ప్రధానార్చకులు రంగరాజన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ఆలయ వ్యవస్థాపక ప్రధానార్చకులు సీఎస్ సౌందరరాజన్(90) పరమపదించారు (CS Soundararajan). వృద్ధాప్య సంబంధ అనారోగ్యం కారణంగా కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. ఈమేరకు ఆయన తనయుడు రంగరాజన్ వెల్లడించారు.
ఆలయాలకు స్వయంప్రతిపత్తి కావాలని, హుండీలు, వీఐపీ కల్చర్ వద్దని సౌందరరాజన్ (CS Soundararajan) పోరాడారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో అందరికీ సమానంగా స్వామి దర్శనం కల్పించే సంప్రదాయం నెలకొల్పారు. ‘కళ్లు తెరచి స్వామిని చూడండి, కళ్లు మూసుకొని కాదు’ అంటూ ఆయన చెప్పిన మాటలు, భక్తులను ఉద్దేశించి చెప్పే సూక్తులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుత ప్రధానార్చకులైన రంగరాజన్ సైతం తన తండ్రి బాటనే ఆచరిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నారు.
కాగా, హైదరాబాద్ మహానగరానికి సమీపంలోని చిలుకూరులో ఉన్న బాలాజీ ఆలయం వీసా టెంపుల్‌గా ప్రసిద్ధి. విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికాలోని యూనివర్సిటీల్లో ఉన్నతవిద్య అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకున్న మన విద్యార్థులు.. వీసా రావాలని కోరుకుంటూ ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటారు. అందువల్ల ఈ ఆలయం వీసా టెంపుల్‌గా, ఇందులోని స్వామి వీసాల దేవుడిగా ప్రసిద్ధి చెందారు.
Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్
Follow Us On: Instagram

