హనుమకొండలో బాలల హక్కుల వారోత్సవ వాకథాన్

కలం, హనుమకొండ: బాలల హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో (Child Rights Week) భాగంగా శుక్రవారం పోలీస్ కమిషనరేట్ నుంచి కలెక్టరేట్ వరకు వాకథాన్ నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మిషన్ వాత్సల్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజ, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ రమేష్, జేజేబీ సభ్యురాలు గోపికా రాణి, కేయూ పాలకమండలి సభ్యురాలు అనితా రెడ్డి ప్రారంభించారు. అనంతరం కళాజాత బృందం పాటల ద్వారా బాలల హక్కులు, బాల్యవివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా నివారణపై అవగాహన కల్పించింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జీవించే హక్కు, రక్షణ, అభివృద్ధి, భాగస్వామ్యం బాలల ప్రాథమిక హక్కులని తెలిపారు. ‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్‌’ కార్యక్రమం ద్వారా పిల్లలకు హక్కులపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం పిల్లలతో కలిసి బెలూన్లు ఎగురవేసి, సిగ్నేచర్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలరక్షా భవన్ కోఆర్డినేటర్ అవంతి, ఇన్‌చార్జి డీసీపీవో ప్రవీణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>