కలం, వలిగొండ : తెలంగాణ గౌడ యువజన సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వలిగొండ గ్రామానికి చెందిన పల్సం రాజు గౌడ్ (Palsam Raju Goud) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు బొంగు మనోజ్ గౌడ్ విజ్ఞప్తి మేరకు ఈ నియామకం చేపట్టినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. జిల్లా స్థాయిలో సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు గౌడ యువతను, కల్లుగీత కార్మికులను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో రాజు గౌడ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు.
తన నియామకానికి సహకరించి, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు నరేష్ గౌడ్, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షుడు బొంగు మనోజ్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులకు రాజు గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా గౌడ జాతికి సేవ చేసే అవకాశంగా భావిస్తానని, గీత కార్మికుల సమస్యల పరిష్కారం, గౌడ యువత ఐక్యత, హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

