Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు కూటమి పార్టీల అగ్ర నేతల భేటీ

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీలో కూట‌మి పార్టీల అగ్ర‌నేత‌లు నేడు భేటీ కానున్నారు. సీఎం చంద్ర‌బాబు (Chandrababu) ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో ఉద‌యం 11 గంట‌ల‌కు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌(Pawan Kalyan), బీజేపీ(BJP) రాష్ట్ర అధ్య‌క్షుడు మాధవ్‌(Madhav)తో స‌మావేశం కానున్నారు. క‌ల్తీ నెయ్యి అంశంపై ముగ్గురు చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. నెయ్యిలో జంతు కొవ్వు క‌ల‌వ‌లేద‌ని సిట్ నివేదిక రావ‌డంతో వైసీపీ(YSRCP) నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలన్నదే ప్రధాన అంశంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపై కేబినెట్‌ ఇప్పటికే మరో సిట్ విచారణకు ప్రతిపాదన చేసింది. వైసీపీ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి బాగోతాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని సీఎం చంద్ర‌బాబు ఇటీవ‌ల మంత్రుల‌కు సూచించారు. ఇదే అంశాన్ని జ‌న‌సేన‌, బీజేపీ అధినేత‌ల‌తో చ‌ర్చించ‌నున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>