epaper
Wednesday, February 18, 2026
epaper

బీజాపూర్ అడ‌వుల్లో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..!

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్(Bijapur) జిల్లాలో నక్సలైట్లు(Naxals), భద్రతా దళాల మధ్య మ‌రోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ ప్ర‌ధాన‌ నక్సలైట్ కమాండర్, ఇతర నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్ర‌స్తుతం కాల్పులు కొన‌సాగుతున్నాయి. కాల్పులు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలువడనున్నాయి. చిన్నగెల్లూరు ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారని భ‌ద్ర‌తా ద‌ళాల‌కు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభించాయి. డీఆర్జీ, ఇతర సైనికులు అక్కడికి చేరుకోగానే నక్సలైట్లు తక్షణమే కాల్పులు ప్రారంభించారు. భ‌ద్ర‌తా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

ప్రధాన నక్సలైట్ మృతి..?

ఈ ఘర్షణలో నక్సలైట్ కమాండర్, డీవీసీ సభ్యుడు ఉదమ్ సింగ్ మృతి చెందారని సమాచారం. మ‌రికొంద‌రు న‌క్స‌లైట్లు కూడా మృతి చెందార‌ని తెలుస్తోంది. కానీ, దీనిపై అధికారిక స‌మాచారం ఇంకా అంద‌లేదు. కాల్పులు జ‌రిగిన ప్రాంతంలో ఒక ఏకే 47 రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఉదమ్ సింగ్ మృతి విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు. సర్వే, సర్చింగ్ పూర్త‌యిన‌ తర్వాత మ‌రిన్ని వివ‌రాలు ప్ర‌క‌టిస్తామ‌ని బీజీపూర్ ఎస్పీ వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>