చండూరులో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

కలం, మునుగోడు: వీరనారి చాకలి ఐలమ్మ (Chakali Ilamma) జయంతిని పురస్కరించుకుని చండూరు పురపాలక సంఘం కార్యాలయ (Chandur Municipal Office) ప్రాంగణంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ ధైర్యంగా పోరాడారని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ చేసిన సామాజిక పోరాటం, ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం, కౌన్సిల్ సభ్యులు తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు షేక్ ఖలీల్, షేక్ సలీమా షరీఫ్, మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, జూనియర్ అసిస్టెంట్ ఎ. జగన్, సీనియర్ అకౌంటెంట్ పి. శృతి, వార్డు ఆఫీసర్లు జి. శ్రీరాములు, బి. సాయిరాం, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఎం. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>