జనగామలో చైన్ స్నాచింగ్ కలకలం!

క‌లం, జనగామ: జ‌న‌గామ (Jangaon) ప‌ట్ట‌ణంలో మ‌రోసారి చైన్ స్నాచింగ్ (Chain Snatching) క‌ల‌క‌లం రేపింది. ఇద్ద‌రు యువ‌కులు ఓ మ‌హిళ మెడ‌లో బంగారు గొలులు లాక్కొని బైక్ పై పారిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌ట్ట‌ణంలోని వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డ్ స‌మీపంలో జ‌య‌శంక‌ర్ న‌గ‌ర్ కాల‌నీలో ఇద్ద‌రు మ‌హిళ‌లు న‌డుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు యువ‌కులు బైక్‌పై అటుగా వ‌చ్చారు. మ‌హిళ‌ల వెన‌క బైక్ ఆపారు. ఓ యువ‌కుడు బైక్ దిగి వేగంగా చైన్ లాగి మ‌ళ్లీ బైక్ పై ఎక్కి ఇద్ద‌రు పారిపోయారు. మ‌హిళ‌లు వాళ్ల‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ చిక్క‌లేదు. మ‌హిళ‌ల కేకలు విన్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని సీసీ టీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలించారు. ఈ వీడియో ఆధారంగా నిందితుల‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>