వరంగల్ నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఒంటరిగా వెళ్తున్నట్లు గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు.. మహిళ మెడలో నుంచి గొలుసును కాజేశారు. స్థానికులు అప్రమత్తం అయ్యేసరికి సదరు దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. చుట్టు పక్కల సీసీ కెమెరాలు పరిశీలించి, దుండగులను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>