అలెర్ట్​.. ట్రెండ్​ మైక్రో అపెక్స్​ వన్​లో తీవ్ర లోపాలు!

కలం, వెబ్​ డెస్క్​: ట్రెండ్​ మైక్రో అపెక్స్(Trend Micro Apex) వన్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్​ భద్రతా సంస్థ సీఈఆర్​టీ–ఐఎన్​(CERT-In) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీటిని వాడుతున్నవాళ్లు తక్షణం అప్రమత్తం కావాలని కోరింది. ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. అపెక్స్ వన్ 2019(ఆన్-ప్రెమిసెస్, SaaS వెర్షన్లు), అపెక్స్​ వన్​ మాక్‌ఓఎస్ వెర్షన్, ట్రెండ్​ విజన్​ వన్​ ఎండ్​ పాయింట్​ (SaaS)లో భద్రతా లోపాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రధానంగా వీటిలోని మేనేజ్‌మెంట్ కన్సోల్‌లో డైరెక్టరీ ట్రావర్సల్ బగ్‌లు ఉన్నాయని, దీని ద్వారా హ్యాకర్లు రిమోట్‌గా మాల్‌వేర్ అప్‌లోడ్ చేసి, సిస్టమ్‌లలో కమాండ్‌లు అమలు చేయగలరని చెప్పింది.

అలాగే, దీనితోపాటు మరికొన్ని లోపాలూ ఉన్నాయని, వీటివల్ల హ్యాకర్లు సులభంగా సిస్టమ్‌లోకి చొరబడి, సర్వీసులను బ్రేక్​ చేయవచ్చని తెలిపింది. దాంతోపాటు సున్నితమైన సమాచారాన్ని దొంగలించే ప్రమాదముందని పేర్కొంది. ఇది పెద్ద సంస్థలకు, ముఖ్యంగా ఎండ్‌పాయింట్ ప్రొటెక్షన్‌గా అపెక్స్​ వన్​పై ఆధారపడిన వాటికి తీవ్రమైన ముప్పు అని హెచ్చరించింది.

ఐటీ అడ్మిన్‌లు, SOC టీమ్‌లు, సిస్టమ్ ఇంజినీర్లు, సీఐఎస్ఓలు, సైబర్ భద్రతా నిపుణులు – అపెక్స్​ వన్​(Trend Micro Apex) ఉపయోగిస్తున్న సంస్థలన్నీ తక్షణం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సిస్టమ్‌లను ప్యాచ్ చేయడం, ట్రెండ్ మైక్రో విడుదల చేసిన క్రిటికల్ ప్యాచ్ అప్‌డేట్, ఎండ్‌పాయింట్ ప్రొటెక్షన్ సెట్టింగ్‌లను రీసెట్​ చేయడం, నెట్‌వర్క్‌లో అసాధారణ కార్యకలాపాలపై నిఘా పెట్టడం వంటివి చేయాలని చెప్పింది.

Read Also: ‘అన్నారం’లో ఇసుక అక్రమ రవాణా.. ప్రభుత్వం క్లారిటీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>