Mobile Popup Ad
Mobile Popup Ad

అందరినీ క్షేమంగా తీసుకొస్తాం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్​​ జోషి

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన భారతీయులందరినీ క్షేమంగా తీసుకొస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్​​ జోషి (Pralhad Joshi ) తెలిపారు. దీనికోసం ఇప్పటికే కేంద్రం చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

‘గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ భారతీయులు ఇబ్బందుల్లో పడినా కేంద్ర ప్రభుత్వం వాళ్లను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చింది. భారతీయులు ఎక్కడున్నా, వాళ్ల భద్రతే మా ప్రధాన ప్రాధాన్యత’ అని ఆయన అన్నారు. ఇరాన్–ఇజ్రాయెల్ (Iran – Israel) సంఘర్షణ తీవ్రత వల్ల గల్ఫ్​ దేశాల్లో కన్నడిగులు ఇబ్బంది పడుతున్నారని, తన స్వరాష్ట్రమైన కర్ణాటక నుంచి సమాచారం అందినట్లు జోషి తెలిపారు. వాళ్లతోపాటు భారతీయులందరి రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవడానికి సీనియర్ మంత్రులతో అత్యవసర సంప్రదింపులు జరిపినట్లు వివరించారు.

యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం విమాన ప్రయాణాలు ప్రమాదకరంగా ఉన్నాయని, మరిన్ని చర్యలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని మంత్రి(Pralhad Joshi ) చెప్పారు. ‘ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరినీ సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

Read Also: ఆ మొబైల్ సిగ్నల్ బూస్టర్లు వాడితే నేరమే..

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>