Mobile Popup Ad
Mobile Popup Ad

క్రీడలకు భారీ బూస్ట్.. CSR నిధుల్లో స్పోర్ట్స్‌కు ప్రత్యేక స్థానం

కలం, స్పోర్ట్స్ : దేశంలో క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఖర్చు చేసే CSR నిధుల్లో తొలిసారిగా క్రీడలను ప్రత్యేక అంశంగా గుర్తిస్తూ ప్రజా రంగ సంస్థల విభాగం (DPE) కొత్త నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా క్రీడా రంగానికి మరింత నిధులు అందే అవకాశం కనిపిస్తోంది. 2018లో డీపీఈ కామన్ సీఎస్ఆర్ థీమ్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పట్లో పాఠశాల విద్య, ఆరోగ్య రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంపిక చేసింది. తర్వాత ఆరోగ్యం, పోషకాహారం వంటి విభాగాలను కూడా చేర్చింది.

అయితే క్రీడలు కంపెనీల చట్టం-2013 ప్రకారం CSR కింద అర్హత పొందినప్పటికీ, ప్రత్యేక కామన్ థీమ్‌గా ఇప్పటివరకు గుర్తింపు పొందలేదు. ఇప్పుడు 2026-27, 2027-28 ఆర్థిక సంవత్సరాల కోసం క్రీడలను అధికారికంగా కామన్ CSR థీమ్‌లో చేర్చింది. క్రీడా మైదానాలు, అవసరమైన పరికరాలు, నాణ్యమైన కోచింగ్, క్రీడా కార్యక్రమాల నిర్వహణ, క్రీడాకారుల ప్రోత్సాహం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల CSR ప్రణాళికల్లో క్రీడలకు మరింత స్థానం లభించనుంది.

గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను గుర్తించడం, మౌలిక వసతులు పెంచడం, క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలకు ఊతం దక్కే అవకాశం ఉంది. అలాగే ఖేలో భారత్ నీతి-2025, ఖేలో ఇండియా మిషన్ లక్ష్యాలకు ఈ నిర్ణయం తోడ్పడనుంది. దేశంలో బలమైన క్రీడా వ్యవస్థ నిర్మాణానికి ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>