కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతుల ముద్దుల కూతురు క్లింకార (Klin Kaara) నేడు మూడో పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తల్లి ఉపాసన సోషల్ మీడియాలో ఓ క్యూట్ ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ఫోటోలో రామ్ చరణ్, ఉపాసనతో కలిసి చిన్నారి క్లింకార ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు చాలా అరుదుగా కనిపించిన క్లింకార ఫేస్ రివీల్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “హ్యాపీ బర్త్‌డే క్లింకార” అంటూ ఈ స్పెషల్ పిక్‌ను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే #HappyBirthdayKlinKaara, #KlinKaaraTurns3, #MegaPrincess వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

