కలం, వెబ్ డెస్క్: ధురంధర్ (Dhurandhar) సినిమా విడుదలై రోజులు గడుస్తున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమా చూస్తూ నటీనటులు, డైరెక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)సికింద్రాబాద్‌లోని ఓ థియేటర్‌లో ధురంధర్ సినిమా చూసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సినిమా చూశానని, ఈ సినిమా ఒక అద్భుతమని కొనియాడారు. ఎమోషన్స్, జాతీయ సమగ్రత, దేశభక్తి కలగలిసిన గొప్ప ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ సినిమా అందించిందన్నారు. డైరెక్టర్ ఆదిత్య ధర్ భారత ప్రజల ధైర్యసాహసాలు, త్యాగాలు, సమష్టి స్ఫూర్తిని కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించాని ప్రశంసించారు.

