అమెరికా – ఇరాన్ యుద్ధం.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా – ఇరాన్ యుద్ధం చర్చల దశలో విఫలమైన వేళ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక హెచ్చరికలు చేశారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. చైనాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. చైనా.. ఇరాన్ కు క్షిపణులు సరఫరా చేస్తున్నట్లు తనకు నివేదికలు అందినట్లు ‘సండే మార్నింగ్ ఫ్యూచర్స్’ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే, చైనా ఆయుధాలు అందించడం చేయదని.. ఒకవేళ సరఫరా చేస్తే పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు (Donald Trump) స్పష్టం చేశారు.

‘చైనా అలా చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే నాకు వాళ్లతో సంబంధం ఉంది. అలా చేయరని నేను భావిస్తున్నాను. మొదట్లో ఆయుధాలు సరఫరా చేసి ఉండొచ్చు. కానీ అది ఇప్పుడు కొనసాగుతూ పట్టుబడితే ఆ దేశంపై 50 శాతం టారిఫ్స్ విధిస్తాం’ అని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>