Mobile Popup Ad
Mobile Popup Ad

కాంబినేషన్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం

కలం, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం (Central Govt) సంచలన నిర్ణయం తీసుకున్నది. వైద్యపరంగా సరైన కారణాలు లేకపోగా.. రోగుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. నిషేధానికి గురైన మందుల్లో చర్మ వ్యాధులకు వాడే క్రీములు, నొప్పులు, కడుపునొప్పి నివారణ మందులు, కొన్ని రకాల యాంటీబయాటిక్ కాంబినేషన్లు ఉన్నాయి.

కొన్ని మేలు.. కొన్ని చేటు

రెండు లేదా అంతకంటే ఎక్కువ మందులను ఒక నిర్ణీత నిష్పత్తిలో కలిపి ఒకే మాత్ర లేదా సిరప్ రూపంలో తయారు చేయడాన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) అంటారు. కొన్ని రకాల కాంబినేషన్లు రోగులకు మేలు చేసినప్పటికీ.. ప్రభుత్వం నిషేధించిన ఈ 16 రకాల కాంబినేషన్లు అశాస్త్రీయంగా, అసమర్థంగా, శరీరానికి హానికరంగా మారినట్లు నిపుణుల కమిటీ సమీక్షలో తేలింది.

స్టాక్ ఉపసంహరించుకోవాలని ఆదేశాలు

డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టంలోని సెక్షన్ 26ఏ కింద ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఈ నిషేధం విధించింది. ఈ 16 రకాల మందుల తయారీ, అమ్మకాలు, పంపిణీని దేశంలో ఎక్కడా జరగకుండా కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, నియంత్రణ సంస్థలను కేంద్రం ఆదేశించింది. తయారీదారులు, పంపిణీదారులు తమ స్టాక్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>