హనుమకొండలో చర్చి భూములు రక్షించాలని ర్యాలీ

కలం, హనుమకొండ: మిషనరీ చర్చి భూములు పరిరక్షించి, వాటిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి హనుమకొండ (CBC Hanumakonda) కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హనుమకొండలోని చర్చి ప్రాంగణం నుంచి అశోక జంక్షన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కమిటీ బాధ్యులు మాట్లాడుతూ.. మండల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి చర్చి భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆరోపించారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చర్చి ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించరాదన్నారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read : ఓం.. భీమ్‌.. బుష్‌.. హ‌రీశ్‌.. పొంగులేటి ఆస‌క్తిక‌ర పోస్ట్‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>