కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో (Banswada) బీఎస్సీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినుల మొదటి గ్రాడ్యువేషన్ డే వీడ్కోలు సభ ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థినులకు డిగ్రీ పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఆని ప్రణతి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

