కలం, మెదక్ బ్యూరో : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ (Gajwel Municipality) లో బీఅర్ఎస్ పార్టీ పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా గులాబీ పార్టీ అతికష్టం మీద 11 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ 7, బీజెపీ 1, స్వతంత్ర 1 వార్డులో విజయం సాధించారు. చైర్మన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 11 సాధించి ఊపిరి పీల్చుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్న తమ బాస్ కేసీఆర్ ఇలాకా అయిన గజ్వేల్ లో కేవలం మ్యాజిక్ నెంబర్ మాత్రం సాధించడమేంటని బీఆర్ఎస్ (BRS) శ్రేణులు అందోళన చెందుతున్నారు. ఒక్క వార్డు తక్కువ వచ్చినా పరిస్ధితి మరింత ఘోరం ఉండేదని అనుకుంటున్నారు. గజ్వేల్ ను రాష్ట్రానికి మోడల్ గా చూపుతూ అభివృద్ధి చేసిన చోటే ఇలాంటి ఫలితాలు రావడంపై బీఅర్ఎస్ కార్యకర్తలు అందోళన చెందుతున్నారు. సాక్షాత్తూ కేసీఅర్ (KCR) ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటిలోనే పార్టీకి ఆదరణ లేకపోతే .. భవిష్యత్తులో ఎలా ఉంటుందోనని మదనపడుతున్నారు. రెండేళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రచారం చేస్తుంటే గజ్వేల్ మున్సిపాలిటీ (Gajwel Municipality) తరహా ఫలితాలు క్యాడర్ ను అందోళనకు గురిచేస్తున్నాయి.
బీఅర్ఎస్ పార్టీ పట్ల గజ్వేల్ ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది అనడానికి మున్సిపల్ ఫలితాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయంటున్నారు కొందరు. ముఖ్యంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల సర్వం కొల్పొయిన ముంపు భాదితుల కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నాయి. గజ్వేల్ మున్సిపల్ ప్రచారంలో కుడా బీఅర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు రాకూడదంటూ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు అందోళన చేశారు. దీంతో అయన అర్అండ్అర్ కాలనీలో ప్రచారం చేయకుండనే వెనుదిరిగాడు. తాజాగా మున్సిపల్ ఫలితాలు కుడా చెప్పుకోదగిన స్ధాయిలో రాకపోవడానికి కారణలను బీఅర్ఎస్ నాయకులు విశ్లేషిస్తున్నారు.
Read Also: మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కోమటిరెడ్డి
Follow Us On : WhatsApp


