కలం, వెబ్ డెస్క్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాకు (BRS Protest) సిద్ధమయ్యారు. ఎల్బీనగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన ద్వారా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్‌ఎస్ నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి (MLA Sudheer Reddy) నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేయనున్నారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణకు సంబంధించిన అంశాలను నిరసనలో ప్రస్తావించారు.
ఎల్బీనగర్ చౌరస్తాలో ధర్నా నేపథ్యంలో ఆ ప్రాంతంలో రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. నిరసనకు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటే సంబంధిత అధికారుల సూచనలు పాటించాలని వాహనదారులకు సూచిస్తున్నారు.
ఎస్‌ఐఆర్ పెద్ద మోసం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ పేరుతో ప్రతిపక్షాలకు ఓటు వేసిన వారి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. నిరసనల వేళ రైళ్లు రద్దు చేసి, మెట్రో స్టేషన్లకు తాళాలు వేసి, 22 వేల మంది పోలీసులను మోహరించారని విమర్శించారు. యువతను నిర్బంధించారని పేర్కొంటూ, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

