కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య (Chaderghat Murder) చోటుచేసుకుంది. ఆజంపురా సహీఫా మసీదు సమీపంలోని క్లాతింగ్ షాపులో పనిచేస్తున్న చంచల్‌గూడకు చెందిన తహేరా బాను(34) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అదే షాపులో గతంలో పనిచేసిన మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి కత్తితో మహిళపై దాడి చేసి దారుణంగా హత్యచేశాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమా? లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

