Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మంలో ప్రొటోకాల్ రగడ.. కాంగ్రెస్ ఎంపీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసన

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం కలెక్టరేట్‌లో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఎదుట బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ తాత మధుసూదన్ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ సమావేశం శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సమావేశానికిగాను ఎమ్మెల్సీకి ఇన్విటేషన్ లేకపోవడంపై తాతా మధుసూదన్ (Tata Madhusudan) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్‌పై ఆయన మండిపడ్డారు. జిల్లాభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన మీటింగ్‌కు తనతోపాటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు ఆహ్వానం లేకపోవడంపై మధు అసహనానికి గురయ్యారు.

అనంతరం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి కలుగజేసుకొని మధుని శాంతింపజేశారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కాగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది.

Read Also : కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఎన్డీటీవీ రిపోర్టర్‌పై దాడి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>